More
    HomeFeaturesMobile Signal | వ‌ర్షాకాలంలో మొబైల్ సిగ్న‌ల్స్ రాక ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్...

    Mobile Signal | వ‌ర్షాకాలంలో మొబైల్ సిగ్న‌ల్స్ రాక ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి..!

    Published on

    అక్షరటుడేర, వెబ్​డెస్క్ : Mobile Signal | వర్షాకాలం(Rainy Season)లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల కారణంగా మొబైల్ టవర్స్ (Mobile Towers) నుంచి వచ్చే సిగ్నల్స్ బలహీనపడటం సాధారణమే. దీంతో మొబైల్ వినియోగదారులు కాల్స్ చేయడంలో, డేటా వాడకంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా, డేటాపై ఆధారపడే పనులు చేసే వారికి ఇది పెద్ద ఆటంకంగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు, మీ మొబైల్ సిగ్నల్(Mobile Signal)​ మరింత మెరుగుపడుతుంది.

    Mobile Signal | ఇవి పాటించండి..

    మీ ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఎరోప్లెయిన్​ మోడ్‌ను ఆన్ చేయండి. 10-15 సెకన్ల పాటు వేచి ఉండి మళ్లీ ఆఫ్ చేయండి. ఇది మీ ఫోన్ నెట్‌వర్క్ కనెక్షన్‌ను రీసెట్ చేసి, సమీప టవర్‌తో బలమైన కనెక్షన్ ఏర్పడేందుకు సహాయపడుతుంది. ఫోన్ అప్పుడప్పుడు 2G/3Gలోనే నిలిచిపోతుంటుంది. దీంతో సిగ్నల్ బలహీనమవుతుంది. ఈ క్రమంలో Settings > Mobile Network > Preferred Network Type కు వెళ్లి 4G లేదా 5G ఎంపిక చేసుకోండి. లేదంటే ‘Auto Mode’లో ఉంచడం వల్ల ఫోన్ బలమైన టవర్‌ను ఎంచుకుంటుంది. మాన్యువ‌ల్ నెట్​వ‌ర్క్ సెల‌క్ష‌న్ అయినట్లయితే Settings > Mobile Networks > Network Operators లోకి వెళ్లి, Search Networks ఎంచుకొని బలమైన నెట్‌వర్క్‌ను సెలెక్ట్ చేయవచ్చు.

    సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, ఇంట్లో Wi-Fi ఉంటే Wi-Fi Calling ఆప్షన్‌ను సెట్టింగ్స్‌లో ఆన్ చేయండి. దీంతో మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేయడం, ఇంటర్నెట్ వాడడం సాధ్యమే. ఫోన్ రీస్టార్ట్ చేయడం ద్వారా సిగ్నల్ సమస్య తక్షణమే తీరే అవకాశం ఉంటుంది. ఇది నెట్‌వర్క్‌ను రీఫ్రెష్ చేస్తుంది. మీరు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తుంటే, వర్షాకాలంలో తరచూ సిగ్నల్ డ్రాప్ అనుభవిస్తుంటే.. Signal Booster లేదా Repeater కొనుగోలు చేసి ఇంట్లో ఏర్పాటు చేయండి. ఇది బలహీనమైన సిగ్నల్‌ను పటిష్టంగా మార్చి మంచి నెట్‌వర్క్ అందిస్తుంది. పాత సాఫ్ట్‌వేర్ వల్ల కూడా సిగ్నల్ సమస్యలు రావచ్చు. అప్పుడు Settings > Software Update కు వెళ్లి.. లేటెస్ట్ వర్షన్ ఉంటే అప్‌డేట్ చేయండి. సిమ్ కార్డు సరిగ్గా సెట్ కాకపోతే లేదా దుమ్ము చేరితే సిగ్నల్ డ్రాప్ కావచ్చు. అప్పుడు సిమ్ కార్డు తీసి, మృదువైన క్లాత్​తో శుభ్రం చేసి తిరిగి పెట్టండి. ఎన్ని ట్రిక్స్ ఉప‌యోగించిన సిగ్నల్ సమస్య కొనసాగితే మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. వారి పరిధిలో టవర్‌ సమస్య ఉంటే వెంట‌నే ప‌రిష్క‌రిస్తారు.

    More like this

    Urea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.....

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...