Homeబిజినెస్​Fixed deposits | రిస్క్‌ లేని రాబడికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే బెస్ట్‌.. అధిక వడ్డీ చెల్లిస్తున్న...

Fixed deposits | రిస్క్‌ లేని రాబడికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే బెస్ట్‌.. అధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులేవంటే..

Fixed deposits | స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడమైనా, తెలిసినవారికి వడ్డీకి ఇవ్వడమైనా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే.. ఎలాంటి రిస్క్‌లేని పెట్టుబడికి ఉత్తమ ఎంపికగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు నిలుస్తున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Fixed deposits | స్టాక్‌ మార్కెట్‌(stock market)లో పెట్టుబడి పెట్టడమైనా, తెలిసినవారికి వడ్డీకి ఇవ్వడమైనా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే.. ఎలాంటి రిస్క్‌లేని పెట్టుబడికి ఉత్తమ ఎంపికగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(FD) నిలుస్తున్నాయి.

రిస్క్‌ లేని రాబడి కోసం ఎదురు చూస్తున్నవారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే ఉత్తమ ఎంపికలుగా నిలుస్తున్నాయి. ఇందులో వచ్చే వడ్డీ తక్కువైనా కచ్చితమైన రాబడి ఉంటుంది. పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు.

అందుకే చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతుంటారు. కొన్ని బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రధానంగా సీనియర్‌ సిటిజన్లకు మరింత ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందామా..

Fixed deposits | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC Bank) 18 నెలల నుంచి 21 నెలల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.6 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 60 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు 0.5 శాతం అదనంగా.. అంటే 7.1 శాతం వడ్డీ ఇస్తోంది.

Fixed deposits | ఐసీఐసీఐ బ్యాంక్‌

దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ బ్యాంక్‌(ICICI Bank) రెండేళ్ల టెన్యూర్‌పై 6.6 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ చెల్లిస్తోంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(PNB) 390 రోజుల టెన్యూర్‌పై 6.6 శాతం వడ్డీ ఆఫర్‌ చేస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ చెల్లిస్తోంది.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

కోటక్‌ మహీంద్రా(Kotak Mahindra) బ్యాంకు 390 రోజుల నుంచి 23 నెలల కాలపరిమితి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.6 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు 7.1 శాతం వడ్డీ అందిస్తోంది.

ఫెడరల్‌ బ్యాంక్‌

ఫెడరల్‌ బ్యాంక్‌(Federal bank) 999 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు దీనికి అదనంగా 0.5 శాతం వడ్డీ ఇస్తోంది.

కెనరా బ్యాంకు

కెనరా బ్యాంకు(Canara bank) 444 రోజుల స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 6.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులోనూ సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ చెల్లిస్తోంది.

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(UBI) మూడేళ్ల టెన్యూర్‌గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.6 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.1 శాతం వడ్డీ ఇస్తోంది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

రెండు నుంచి మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ(SBI) 6.45 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు 6.95 శాతం వడ్డీ అందుతోంది.