Homeక్రైంKothugudem | వీధి కుక్క దాడి.. ఐదేళ్ల చిన్నారి మృతి

Kothugudem | వీధి కుక్క దాడి.. ఐదేళ్ల చిన్నారి మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kothugudem | పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా సుజాతనగర్​ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన బానోత్ రమేష్, స్వప్న దంపతుల కుమార్తె నిహారిక గాయత్రి(5) మే 13న ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్క కరిచింది. ఆమెను కొత్తగూడెంలోని ఆసుపత్రికి (Kothugudem Hospital) తరలించగా వ్యాక్సిన్ చేసి వైద్యులు ఇంటికి పంపారు. అయితే ఈ నెల 25న చిన్నారి వింతగా ప్రవర్తించడం, నోటి నుంచి నురుగు రావడంతో తల్లిదండ్రులు ఖమ్మం(Khammam)లోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

రాష్ట్రంలో ఇటీవల కుక్కల బెడద ఎక్కువైంది. అయినా పట్టించుకొని ప్రభుత్వం మిస్​ వరల్డ్ (Miss World) పోటీదారుల కోసం హైదరాబాద్​లో మాత్రం కుక్కలు పట్టించిందని పలువురు విమర్శిస్తున్నారు. మిస్​ వరల్డ్​ పోటీదారుల కోసం జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వానికి.. సామాన్యుల ప్రాణాలంటే పట్టవా అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో కుక్కల బెడద అరికట్టాలని కోరుతున్నారు.