అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | రెండో విడత పంచాయతీ ఎన్నికలకు 765 మంది సిబ్బందితో ఐదంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గాంధారి(Gandhari) మండలం గాంధారి, ముదెల్లి, గండివేట్ పోలింగ్ కేంద్రాలను శనివారం రాత్రి ఆయన పరిశీలించారు.
Sp Rajesh Chandra | శాంతియుతంగా..నిష్పక్షపాతంగా..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు గాంధారి, లింగంపేట్(Lingampet), నాగిరెడ్డిపేట్, నిజాంసాగర్(Nizamsagar), మహ్మద్‌నగర్, ఎల్లారెడ్డి, పిట్లం మండలాల్లో పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం రెండు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, 3 అంతర్జిల్లా అంతర్జిల్లా చెక్‌పోస్టులు, 25 ఎఫ్ఎస్టీ బృందాలు, 5 ఎస్ఎస్టీ బృందాల ద్వారా నిరంతర వాహన తనిఖీలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు.
Sp Rajesh Chandra | కట్టుదిట్టమైన భద్రత..
అదనంగా 36 రూట్ మొబైల్స్, 7 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, మూడు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను మోహరించి ఉన్నాయని ఎస్పీ తెలిపారు. రెండో విడతలో 9 క్రిటికల్, 10 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం, అడ్డంకులు, ఉద్రేకం లేదా ప్రలోభాలు సృష్టించడం నిషేధమని పేర్కొన్నారు.
Sp Rajesh Chandra | పోలింగ్ కేంద్రానికి..
ఓటర్లు పోలింగ్ కేంద్రంలోనికి ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డు మాత్రమే తీసుకురావాలని, పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఇంక్ బాటిల్స్, ఇంక్ పెన్స్, అగ్గి పెట్టె, వాటర్ బాటిల్, కత్తులు తీసుకురాకూడదని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలింగ్ కేంద్రాలవద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
అక్రమ మద్యం రవాణా, నిల్వ, విక్రయాలు, డబ్బు, ఇతర ప్రలోభాలు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పోలింగ్ ముగిసిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, సంబరాలు పూర్తిగా నిషేధించబడ్డాయని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.