అక్షరటుడే, కోటగిరి: Kotagiri | మాల కులస్థులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారని.. అయితే రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని మాల సంఘం డివిజన్ (Mala Sangam Kotagiri Division) అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో (Ambedkar Chowrastha) వర్గీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ రంగాల్లో సమాన రిజర్వేషన్ కల్పించి మాల కులస్థులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విన్నవించారు.
కార్యక్రమంలో మండలాధ్యక్షుడు దండు భూమేష్, డివిజన్ కార్యవర్గ సభ్యులు పుప్పాల సైదయ్య, రాములు, మండల మాల సంఘం ఉపాధ్యక్షులు గంగారం, ఖాలే సాయిలు, కార్యవర్గ సభ్యులు గంగాధర్, గంగారం, లక్ష్మణ్, మారుతి, మొగలప్ప, ఆవుల గంగారం, కిషన్, విఠల్, సాయిలు పాల్గొన్నారు.