అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Uttar Pradesh | కొంత మంది యువత బైక్‌లపై ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
రీల్స్ (Reels) పిచ్చిలో ఇటీవల కొందరు బైక్‌లు, కార్లతో స్టంట్లు (Stunts) చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడుపుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు (traffic rules) పాటించడం లేదు. కొందరైతే బైక్‌పై రోమాన్స్ చేస్తూ రోడ్లపై దూసుకు వెళ్తున్నారు. ఇలాంటి వారితో ఇతరులకు సైతం ప్రమాదం పొంచింది. దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు. అయినా కూడా ఇలాంటి వారు మారడం లేదు. తాజాగా ఒకే బైక్‌పై ఐదుగురు ప్రయాణించగా వారికి పోలీసులు షాక్ ఇచ్చారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో..
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) హాపూర్‌లో ఒకే బైక్‌పై ఐదుగురు యువకులు ప్రమాదకరంగా ప్రయాణించారు. నలుగురు బైక్‌పై కూర్చొగా.. మరో యువకుడిని నలుగురు కలిసి పట్టుకున్నారు. దీనిని మరో వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో (social media) అప్లోడ్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. సదరు వాహనానికి రూ.31 జరిమానా వేశారు. హెల్మెట్, ఇన్సూరెన్స్ లేకపోవడం, ప్రమాదకర ప్రయాణం వంటి ఉల్లంఘనల కింద రూ. 31 ఫైన్ వేశారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా ప్రయాణాలు చేసే వారికి భారీ మొత్తం జరిమానాలు వేస్తేనే మారుతారని పేర్కొంటున్నారు. వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.