HomeతెలంగాణDrunk drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఐదుగురికి జైలు

Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఐదుగురికి జైలు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఐదుగురుకి జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ(Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ (Inspector Prasad) ఆధ్వర్యంలో బుధవారం నగరంలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించగా.. 32మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి వారికి కౌన్సెలింగ్​ చేశారు. అనంతరం గురువారం సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్ (Second Class Magistrate)​ ఎదుట హాజరుపర్చగా ఇద్దరికి ఒకరోజు, ముగ్గురికి రెండు రోజులు జైలుశిక్ష విధించారు. 27మందికి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఏసీపీ వివరించారు.