ePaper
More
    HomeతెలంగాణKonda Murali | ఆ శాఖల్లో ఐదు పైసలు రావు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

    Konda Murali | ఆ శాఖల్లో ఐదు పైసలు రావు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Murali | దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) భర్త కొండా మురళి (Konda Murali) సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేఖకు ఇచ్చిన మూడు శాఖల్లో ఐదు పైసలు కూడా రావన్నారు. మంత్రి సురేఖ ఖర్చులకు తానే నెలకు రూ.5 లక్షలు పంపుతానని ఆయన వ్యాఖ్యానించారు. సురేఖకు మంత్రి పదవి పోతుంది అని కొందరు అంటున్నారని.. రేవంతన్న, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నాక తమకు మంత్రి పదవి ఎక్కడికి పోదన్నారు.

    Konda Murali | సొంత పార్టీ నేతలపై..

    కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై ఆయన తీవ్ర స్థాయిలో మాట్లాడారు. వరంగల్ (Warangal district) జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు 15 ఏళ్లు టీడీపీని భ్రష్టు పట్టించాడని, చంద్రబాబును ఓడగొట్టాడని అన్నారు. అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడని కడియం శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మొన్న కేటీఆర్‌ను వెన్నుపోటు పొడిచిండని, ఎన్‌కౌంటర్ల స్పెషలిస్ట్.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాడని పేర్కొన్నారు. ఇజ్జత్ ఉంటే బయటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు రాజీనామా చేసి గెలవాలని మురళి అన్నారు.

    Konda Murali | అక్కడ నా బిడ్డ పోటీ చేస్తుంది

    పరకాల(Parakal)లో 75 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడని రేవూరి ప్రకాశ్​రెడ్డిని ఉద్దేశించి మురళి అన్నారు. ఎన్నికలకు ముందు తమ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గంలో తన కూతురు కొండా సుస్మిత పటేల్ (Konda Susmitha) రంగప్రవేశం చేస్తుందని ఆయన తెలిపారు.

    Konda Murali | పోలీసులకు వార్నింగ్​

    కొండా మురళి పోలీసులకు సైతం వార్నింగ్​ ఇచ్చారు. ఇటీవల ప్రొటోకాల్​ లేని ఆయనకు ఎస్కార్ట్​ ఇచ్చిన పోలీసులపై సీపీ చర్యలు తీసుకున్నారు. దీంతో మురళి మాట్టాడుతూ. పోలీస్​ డిపార్ట్‌మెంట్‌లో కోవర్డులు ఉన్నారన్నారు. తనకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం కాదని, కోవర్డులపై చర్యలు తీసుకోవాలన్నారు. కొండా మురళి ఉన్నంత వరకు వరంగల్ తూర్పులో రెండో నాయకుడు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...