అక్షరటుడే, వెబ్డెస్క్:Mumbai Local Trains | మహారాష్ట్రలోని ముంబై(Mumbai)లో విషాద ఘటన చోటు చేసుకుంది. నడుస్తున్న రైలు (Moving Train) నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు (Travelers) మృతి చెందారు.
లోకల్ ట్రైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్(Chhatrapati Shivaji Maharaj Terminal)కు వెళ్తుండగా ముంబ్రా- దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్- కసారా లోకల్ ట్రెయిన్లు ఒకదానిని ఒకటి దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
లోకల్ ట్రెయిన్(Local Train) నుంచి దాదాపు 12 మంది కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. గాయపడ్డ వారిని అధికారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముంబై లోకల్ రైళ్లలో అధిక రద్దీ సర్వసాధారణం. నిత్యం అక్కడ డోర్ల వద్ద నిలబడి ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సైతం అధిక రద్దీ ఉండటంతో ప్రజలు డోర్ వద్ద వేలాడుతూ నిలబడ్డారు. ఈ క్రమంలో 12 మంది జారి కిందపడగా.. ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు.