6
అక్షరటుడే, బోధన్: Bodhan CI | పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచి ఉంచిన ఐదుగురికి జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకట నారాయణ (CI Venkata Narayana) తెలిపారు. రాత్రి వేళల్లో నిర్ణీత సమయానికి మించి హోటళ్లు(hotels), షాపులు తెరిచి ఉంచిన దుకాణదారులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిని సోమవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ (Second Class Magistrate) శేషతల్ప సాయి ముందు హాజరుపర్చారు. ఇద్దరు దాబా యజమానులు, ఇద్దరు ఫాస్ట్ ఫుడ్ యజమానులకు జడ్జి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు సీఐ వెల్లడించారు.