అక్షరటుడే, వెబ్‌డెస్క్: children missing : ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం Brahmangari Matham mandal మల్లెపల్లె చెరువులో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. ఈతకు వెళ్లిన తమ పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో సాయంత్రం తల్లిదండ్రులు చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ గట్టుపై ఉన్న దుస్తులను చూసి గల్లంతైనట్లుగా నిర్ధారించి, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. గల్లంతైన పిల్లల కోసం గాలిస్తున్నారు. చీకటి పడటంతో అక్కడే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు చేస్తున్న వాహనాలను చెరువు వద్దకు తీసుకొచ్చి, వాటి వెలుతురులో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన చరణ్, పార్థు, తరుణ్, హర్ష, దీక్షిత్ 12 ఏళ్లలోపు వారే. పిల్లలు కనిపించక పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలిచివేసింది.