అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండి వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా స్థానికులు పట్టించుకోవడం లేదు.
వరద ప్రవాహానికి దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, స్థానికులు ఆ సూచనలను పట్టించుకోకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేపల వేట కొనసాగిస్తున్నారు. బాన్సువాడ మండలం కోనాపూర్‌లో చెరువు (Konapur Cheruvu) ప్రమాదకర స్థాయికి చేరి అలుగు పారుతోంది. నీటి ఉధృతి అధికంగా ఉన్నప్పటికీ స్థానికులు అలుగు వద్ద చేపలు పడుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఇటీవల నస్రుల్లాబాద్ (Nasruallabad) మండలం దుర్కి (Durki) శివారు కల్వర్టు వద్ద చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కొంతమంది పట్టించుకోకుండా చేపలు పడుతున్నారు.