అక్షరటుడే, వెబ్డెస్క్ : Chepa Prasadam | మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exhibition Ground)లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఏటా మృగశిర కార్తె(Mrigashira Kaarthe) సందర్భంగా ప్రతి ఏటా బత్తిని గౌడ్ కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడుతున్న వారు చేప ప్రసాదం తీసుకోవడానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. సుమారు ఐదు లక్షల మంది ప్రజలు చేప ప్రసాదం కోసం వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
