Homeతెలంగాణphotography competition | ఫొటోగ్రఫీ పోటీల్లో 'ఈనాడు' ఫొటోగ్రాఫర్​కు ప్రథమ బహుమతి

photography competition | ఫొటోగ్రఫీ పోటీల్లో ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్​కు ప్రథమ బహుమతి

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: photography competition | తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్పీ జేఏ) Telangana State Photo Journalists Association (TSP JA) ఫొటోగ్రఫీ మీద తాజాగా 23వ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించింది. ఇందులో నిజామాబాద్ (Nizamabad) ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్ ఇంగు శ్రీనివాస్ (‘Eenadu’ photographer Ingu Srinivas) ప్రథమ బహుమతి (first prize) సొంతం చేసుకున్నారు.

ఎ.కృష్ణ ద్వితీయ, బి.బాలస్వామి తృతీయ బహుమతికి అర్హత సాధించారు. వీరితో పాటు మరో పది మంది ప్రోత్సాహక బహుమతులకు ఎంపికయ్యారు.

photography competition | ఫొటోగ్రఫీ పోటీల్లో 'ఈనాడు' ఫొటోగ్రాఫర్​కు ప్రథమ బహుమతి
photography competition | ఫొటోగ్రఫీ పోటీల్లో ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్​కు ప్రథమ బహుమతి

photography competition | ఫొటోగ్రఫీ దినోత్సవం నాడు..

ఈ మేరకు ఆదివారం (ఆగస్టు 17) బషీర్​బాగ్ దేశోద్ధారక భవన్(Basheerbagh Deshodharaka Bhavan)​లో ఫొటోగ్రఫీ అకాడమీ (Photography Academy) కోశాధికారి విశ్వేందర్రెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం విశ్రాంత ప్రొఫెసర్ సత్తిరెడ్డి, ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ ఛైర్మన్ సుధాకర్​ రెడ్డి, టీఎస్పీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు అనుమల గంగాధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎన్ హరి తదితరులు పోటీల ఫలితాలను వెల్లడించారు.

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19) (World Photography Day) సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.

photography competition | ఫొటోగ్రఫీ పోటీల్లో 'ఈనాడు' ఫొటోగ్రాఫర్​కు ప్రథమ బహుమతి
photography competition | ఫొటోగ్రఫీ పోటీల్లో ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్​కు ప్రథమ బహుమతి