అక్షరటుడే, ఇందూరు: Local Body Elections | గ్రామపంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) మొదటి ఘట్టం ముగిసింది. జిల్లాలోని బోధన్ డివిజన్లోని (Bodhan division) 11 మండలాల్లో ఉన్న 184 సర్పంచ్ స్థానాలకు, 1,642 వార్డు స్థానాలకు ఎన్నికలు ఉండగా..ఇప్పటికే 29 సర్పంచ్, 582 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో గురువారం 155 సర్పంచ్, 1,060 వాడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
Local Body Elections | నిజామాబాద్లో 78.83 శాతం నమోదు..
తొలి విడత ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై.. ఒంటిగంట వరకు కొనసాగింది. ఉదయం చలి (cold weather) నేపథ్యంలో ఓటింగ్ కాస్త మందకోడిగా సాగింది. 8 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ప్రజలు క్యూ కట్టారు. నిజామాబాద్ జిల్లాలో తొలిరెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) 19.80 శాతం ఓటింగ్ నమోదైంది.
Local Body Elections | ఉదయం 11 గంటలకు..
అలాగే ఉదయం 11గంటల వరకు 50.73 శాతం ఓట్లు పోలయ్యాయి. ఒంటిగంటకు పోలింగ్ ముగిసే సమయానికి 78.83 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే క్యూలైన్లలో ఓటర్లు ఉండడంతో తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.