అక్షరటుడే, హైదరాబాద్: Panchayat Elections | తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల (Panchayat elections) పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ కొనసాగింది. అయితే ఒంటి గంట వరకు క్యూలైన్లలో నిలబడిన వారికి ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 37,562 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Panchayat Elections | రాష్ట్రంలో 3,834 సర్పంచ్ స్థానాలకు..
రాష్ట్రంలోని 3,834 సర్పంచ్ (Sarpanch) స్థానాల్లో 12,960 మంది బరిలో నిలిచారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా.. 2 గంటలకు కౌంటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం కల్లా వీరి భవితవ్యం తేలిపోనుంది. ఇక 27,628 వార్డుల్లో 65,455 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాయంత్రం ఫలితాల వెల్లడి పూర్తయ్యాక ఉప సర్పంచ్‌ను కూడా నేడు ఎన్నుకోనున్నారు.
Panchayat Elections | మొత్తం 189 మండలాల్లో పోలింగ్
తొలి విడతలో మొత్తం 189 మండలాల్లో పోలింగ్ (polling) జరుగుతోంది. ఈ మండలాల్లో 3,834 పంచాయతీలు, 27,628 వార్డులు ఉన్నాయి. పోలింగ్ విధుల్లో దాదాపు లక్ష మంది సిబ్బంది పాల్గొంటున్నారు. సమస్యాత్మక కేంద్రాల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.