అక్షరటుడే, వెబ్డెస్క్: Panchayat Elections | తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) పోలింగ్ పూర్తయింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రంలో ఆయా పంచాయతీల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. ఒంటి గంట లోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. కాగా.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి కౌంటింగ్ మొదలు పెట్టారు.
Panchayat Elections | 3834 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక
తొలివిడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,834 సర్పంచ్.. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా.. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల (Sarpanch Elections) ఫలితాల ప్రకటన అనంతరం.. వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
Panchayat Elections | మొత్తం 4236 పంచాయతీలు
తొలిదశలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 4236 పంచాయతీలు ఉండగా.. 37,440 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. కాగా.. వీటిలో 396 జీపీలకు సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఆరు పంచాయతీలకు నామినేషన్లు రాలేదు. మరో పంచాయతీ అంశంలో కోర్టు స్టే విధించింది. ఇక 9633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 169 స్థానాలకు నామినేషన్లు రాలేదు. పదింటిపై కోర్టు స్టే విధించింది.