HomeతెలంగాణSolar Canal | ప్ర‌పంచంలోనే తొలిసారి.. కెనాల్‌పై సోలార్ విద్యుదుత్ప‌త్తి

Solar Canal | ప్ర‌పంచంలోనే తొలిసారి.. కెనాల్‌పై సోలార్ విద్యుదుత్ప‌త్తి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Solar Canal | సోలార్ విద్యుత్‌పై దృష్టి సారించిన గుజ‌రాత్ ప్ర‌భుత్వం(Gujarat Government) హైద‌రాబాద్‌కు చెందిన మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్(Mega Engineering Infrastructure Limited) తో క‌లిసి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే తొలిసారి కెనాల్‌పై అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసిన రికార్డును సొంతం చేసుకుంది. సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డంతో పాటు కాలువ‌పై నిర్మించ‌డం ద్వారా నీటి ఆవిరిని గ‌ణ‌నీయంగా త‌గ్గించే ఉద్దేశంతో రెండు విధాలుగా ప్ర‌యోజ‌నం చేకూర్చేలా దీన్ని నిర్మించారు. గుజరాత్‌లోని వడోదరలోని నర్మదా బ్రాంచ్ కెనాల్‌పై 10 మెగావాట్ల కెనాల్-టాప్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించడంలో మెగా కంపెనీ గణనీయమైన పాత్ర పోషించింది.

Solar Canal | అతిపెద్ద సోలార్ ప్లాంట్‌..

వ‌డోదార‌లోని న‌ర్మ‌దా కెనాల్‌(Narmada Canal)పై అతిపెద్ద సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌ను నిర్మించారు. కెనాల్ పొడవునా సౌర ఫ‌ల‌కాలు ఏర్పాటు చేశారు. 5.5 కిలోమీటర్ల పొడ‌వైన‌ విస్తీర్ణంలో 33,800 సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. కెనాల్‌పై అత్యంత పొడ‌వైన సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌(Solar Power Plant)ను ఏర్పాటు చేయ‌డం ప్ర‌పంచంలోనే ఇది తొలిసారి.

Solar Canal | 10 మెగావాట్ల ఉత్ప‌త్తి

అత్యంత పొడ‌వైన కెనాల్‌పై ఏర్పాటు చేసిన 33 వేల సౌర ఫ‌ల‌కాల ద్వారా భారీగా విద్యుదుత్ప‌త్తి చేస్తున్నారు. వీటి ద్వారా 10 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి అవుతోంది. ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, క‌న్‌స్ట్ర‌క్ష‌న్ (ఈపీసీ) విధానంలో హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) దీన్ని నిర్మించింది. 15 మిలియ‌న్ డాలర్ల వ్య‌యంతో నిర్మించిన ఈ సౌర విద్యుత్ ప్లాంట్ కార్య‌క‌లాపాల‌ను మెగా కంపెనీ 25 ఏళ్ల పాటు నిర్వ‌హించ‌నుంది. ఈ ప్లాంట్ సంవత్సరానికి 16 మిలియన్ యూనిట్లకు పైగా ఉత్పత్తి చేస్తుంది.