అక్షరటుడే, వెబ్‌డెస్క్: CISF officer | ప్రపంచంలోనే అత్యధిక ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన తొలి సీఐఎస్ఎఫ్ అధికారి గీతా సమోటా(CISF officer Geeta Samota) రికార్డులకెక్కారు. 8,848 మీటర్లు(29,032 అడుగులు) ఎత్తయిన పర్వాత శిఖరాన్ని గీతా సోమవారం అధిరోహించి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(Central Industrial Security)లో సబ్-ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న గీతా సమోటా భారతీయ మహిళల సత్తా చాటారు. అలాగే, CISFకి మంచి పేరు తీసుకొచ్చారు.
CISF officer | గ్రామీణ ప్రాంతం నుంచి..
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గీత ఈ ఘనత సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌లోని(rajasthan) సికార్ జిల్లాలోని చక్ గ్రామం(Chak village) నుంచి వచ్చిన గీత.. “ప్రపంచ పైకప్పు”పై నిలబడడం అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది. నలుగురు కుమార్తెలున్న నిరుపేద కుటుంబంలో జన్మించిన గీతా సమోటా(geeta samota) సాంప్రదాయ గ్రామీణ వాతావరణంలో పెరిగింది. ఆమె ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో విద్యను అభ్యసించింది. చిన్నప్పటి నుంచి హాకీపై ఎంతో మక్కువ పెంచుకున్న ఆమె కళాశాల స్థాయిలో అద్భుతంగా రాణించింది. అయితే, గాయం కారణంగా ఆమె తన ప్రాణంగా ప్రేమించిన హాకీకి దూరమైంది. అయితే, ఆ ఎదురుదెబ్బ ఆమెకు టర్నింగ్ పాయింట్‌గా మారింది, ఆమెను గొప్ప లక్ష్యం వైపు నడిపించింది.
CISF officer | సీఐఎస్ఎఫ్లో చేరి..
2011లో CISFలో చేరిన గీత పర్వతారోహణపై ఆసక్తిని పెంచుకుంది. సీఐఎస్ఎఫ్లో (CISF) వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆమె.. 2015లో ఔలిలోని ITBP శిక్షణా సంస్థలో ఆరు వారాల ప్రాథమిక పర్వతారోహణ కోర్సుకు ఎంపికైంది. అక్కడ ఆమె తన బ్యాచ్‌లోని ఏకైక మహిళగా నిలిచింది. ఆమె అసాధారణ ప్రతిభ 2017లో అధునాతన శిక్షణకు మార్గం సుగమం చేసింది. ఇంత కఠినమైన కార్యక్రమాన్ని పూర్తి చేసిన మొదటి CISF అధికారిణిగా ఆమె నిలిచింది.
CISF officer | ఒక్కొక్క పర్వతాన్ని అధిగమిస్తూ..
2019లో గీత పర్వతారోహణ ప్రయాణం ఊపందుకుంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF) నుంచి ఉత్తరాఖండ్‌లోని(uttarkhand) మౌంట్ సతోపంత్(7,075 మీటర్లు), నేపాల్‌లోని (nepal) మౌంట్ లోబుచే (6,119 మీటర్లు) రెండింటినీ అధిరోహించిన మొదటి మహిళగా ఆమె రికార్డులకెక్కింది. 2021 CAPF ఎవరెస్ట్ యాత్ర సాంకేతిక కారణాల వల్ల రద్దయింది. ఈ ఎదురుదెబ్బతో కుంగిపోలేదామె. ప్రతి ఖండంలోని ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించడం లక్ష్యంగా “సెవెన్ సమ్మిట్స్” పై దృష్టి పెట్టింది. 2021-22 లో గీత సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్‌లో భాగంగా నాలుగు ప్రధాన శిఖరాలను అధిరోహించింది. ఆస్ట్రేలియాలోని (australia) మౌంట్ కోస్కియుస్కో(2,228 మీటర్లు), రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్(5,642 మీటర్లు), టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో(5,895 మీటర్లు), అర్జెంటీనాలోని మౌంట్ (argentina mount) అకాన్కాగువా(6,961 మీటర్లు)లను కేవలం 6 నెలల 27 రోజుల రికార్డు సమయంలో అధిగమించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత వేగవంతమైన ఈ ఫీట్‌ను సాధించిన భారతీయ మహిళగా ఆమె నిలిచింది. మరో అద్భుతమైన యాత్రలో లడఖ్‌లోని (ladhak) రుప్షు ప్రాంతంలో కేవలం మూడు రోజుల్లోనే ఐదు శిఖరాలను అధిరోహించింది. వాటిలో మూడు 6,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్నాయి.
CISF officer | ప్రతిష్టాత్మక అవార్డులు..
పర్వతారోహణలో దూసుకెళ్తున్న గీతను ప్రతిష్టాత్మక అవార్డులు(prestigious awards) వరించాయి. గీతా సమోటాను ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డు 2023తో సత్కరించింది. “గివింగ్ వింగ్స్ టు డ్రీమ్స్ అవార్డు 2023ను (International Women’s Day Award 2023) పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అందజేసింది. అలాగే, అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆమె సొంతమయ్యాయి. ఆమె ఆకాంక్షలకు CISF మద్దతుగా నిలిచింది. మనాలిలోని ABVIMASలో శిక్షణ అవకాశాలను అందించడంలో, ఆమె ఎవరెస్ట్ యాత్రకు స్పాన్సర్ చేయడం ద్వారా CISF ఎంతో అండగా నిలిచింది. ఆమె విజయంతో ప్రేరణ పొందిన CISF ఇప్పుడు 2026లో ఎవరెస్ట్‌కు పూర్తిగా అంకితమైన పర్వతారోహణ బృందాన్ని పంపాలని యోచిస్తోంది.