అక్షరటుడే, పెద్దకొడప్గల్: First Aid Clinic | మండలంలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే నిర్వహించాలని పీహెచ్సీ వైద్యుడు ఉమాకాంత్ (PHC doctor Umakant) అన్నారు.
మండలంలోని పలు ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లను (First Aid Clinic) బుధవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీఎంపీలు ఫస్ట్‌ఎయిడ్ కాకుండా గ్లూకోజ్‌లు పెట్టడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం సరైంది కాదన్నారు. ఇరుకు గదుల్లో రోగులకు వైద్యం అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మండల కేంద్రంలోని ఓ ల్యాబ్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని.. కానీ పీఎంపీల ప్రోత్సాహంతో వ్యాధి నిర్ధారణ చేస్తుండడం సరైంది కాదని ఆయన అన్నారు. తనిఖీ వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.
