అక్షరటుడే, కామారెడ్డి: Diwali | లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే పటాకులు కొనుగోలు చేయాలని జిల్లా ఫైర్ స్టేషన్ (Fire station) ఆఫీసర్ సుధాకర్ ప్రజలకు సూచించారు. జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో (Fire Department) ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో 94 పటాకుల షాపులకు అనుమతి ఇచినట్లు తెలిపారు. ఒక షాప్‌కు మరో షాప్‌కు మధ్య 3 మీటర్ల దూరం ఉండాలని, ప్రతి షాపు వద్ద 200 లీటర్ల నీటి బ్యారెల్ ఉండాలని 5 కిలోల ఫైర్ సేఫ్టీ సిలిండర్ ఉండాలన్నారు.
ప్రజలు పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఇంటిముందు పటాకులు కాల్చేముందు డోర్లకు పరదాలు లేకుండా చూసుకోవాలి, పటాకులు కాల్చే సమయంలో నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోడ్లు, ఇళ్ల మధ్య పటాకులు కాల్చవద్దని, ఓపెన్ స్థలాల్లో మాత్రమే కాల్చాలన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.