Homeజిల్లాలునిజామాబాద్​Firecrackers | పటాకుల దుకాణాదారులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి: సీపీ సాయిచైతన్య

Firecrackers | పటాకుల దుకాణాదారులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో పటాకుల దుకాణాదారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Firecrackers | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ (Nizamabad Police Commissionerate) పరిధిలో పటాకుల దుకాణాదారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య (Cp Sai chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత డివిజనల్​ పోలీస్​ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. ఎవరైనా ఎలాంటి అనుమతి లేకుండా దుకాణాలు నెలకొల్పితే వారిపై ఎక్స్​ప్లోజివ్ యాక్ట్​-1884 (Explosive act), రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. పటాకుల దుకాణాదారులు తప్పకుండా నిబంధనలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు.

Firecrackers | ఈ నిబంధనలు పాటించాల్సిందే..

  • పటాకుల దుకాణాలను తప్పనిసరిగా ఖాళీ ప్రదేశాల్లోనే నెలకొల్పాలి. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్​ఓసీ సర్టిఫికెట్​ పొందుపర్చాలి.
  • ఒక క్లస్టర్లో 50 షాపులకు మించి ఏర్పాటు చేయరాదు.
  • జనం రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఎట్టిపరిస్థితుల్లో దుకాణాలు నెలకొల్పరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాల్లో, సమావేశాలు నిర్వహించే కేంద్రాల్లో పటాకుల దుకాణాలు నెలకొల్పరాదు.
  • తాత్కాలిక పటాకుల దుకాణాల్లో ఫైర్​కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించాలి.
  • దుకాణ ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తు ఫారంను సంబంధిత ఏసీపీ కార్యాలయంలో అందజేసి అనుమతి తీసుకోవాలని సూచించారు.