HomeతెలంగాణACB Case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫైర్ స్టేషన్ అధికారి

ACB Case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫైర్ స్టేషన్ అధికారి

ACB Case | టపాసుల దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడానికి లంచం అడిగిన అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: ACB Case | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. టపాసుల (Crackers) దుకాణం ఏర్పాటు చేయడానికి లంచం అడిగిన అధికారి రెడ్​ హ్యాండెడ్​గా దొరికిపోయాడు.

దీపావళి సమీపిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో వ్యాపారులు తాత్కాలిక టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ దుకాణాల ఏర్పాటుకు పలు నిబంధనలు పాటించాలి. వీటిని ఆసరాగా చేసుకొని అధికారులు లంచాలు అడుగుతున్నారు. డబ్బులు ఇస్తేనే దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. నల్లగొండ ఫైర్ స్టేషన్ (Nalgonda Fire station) అధికారి ఎ సత్యనారాయణ రెడ్డిని గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఓ వ్యక్తి బాణసంచా దుకాణం నడపుకోవడానికి తాత్కాలిక లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును ప్రాసెస్​ చేసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సత్యనారాయణరెడ్డి రూ.8 వేల లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో గురువారం ఫైర్​ స్టేషన్​ అధికారి డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ACB Case | లంచం ఇవ్వొద్దు

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.