ePaper
More
    HomeజాతీయంAir India Flight | ఎయిర్​ ఇండియా విమానంలో మంటలు

    Air India Flight | ఎయిర్​ ఇండియా విమానంలో మంటలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India Flight | ఎయిర్​ ఇండియా (Air India) విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi Airport) మంగళవారం చోటు చేసుకుంది. హాంకాంగ్​ నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో ల్యాండ్​ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

    హాంకాంగ్​ నుంచి ఢిల్లీ వచ్చిన విమానం ల్యాండ్​ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. పార్కింగ్​ గేట్​ వద్దకు చేరుకున్న తర్వాత సహాయక విద్యుత్ యూనిట్​లో (APU) మంటలు చెలరేగాయి. ఇంజిన్లు ఆపేసిన తర్వాత విమానానికి ఏపీయూ నుంచి విద్యుత్​ సరఫరా అవుతుంది. ప్రయాణికులు విమానం నుంచి దిగే సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనలో విమానానికి కొంత నష్టం జరిగినప్పటికీ.. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

    Air India Flight | వరుస ఘటనలతో ఆందోళన

    అహ్మదాబాద్​లో ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన (Ahmedabad Plane Crash) విషయం తెలిసిందే. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్లాల్సిన బోయింగ్​ విమానం టేకాఫ్​ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు.

    ఈ ప్రమాదం తర్వాత దేశంలో విమానాలకు సంబంధించి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం కొచ్చి నుంచి ముంబై వచ్చిన విమానం ముంబైలో ల్యాండ్​ అవుతుండగా.. రన్​వేపై (Plane Skid on Runway) జారిపోయింది. ఈ ఘటనలో విమానం మూడు టైర్లు పగిలిపోగా.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అయితే వరుస ఘటనలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

    సాంకేతిక సమస్యలతో విమానాలు రన్​వేపై నిలిచిపోవడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing)​ చేస్తుండడంతో ఫ్లైట్​ ఎక్కాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటీవల ఓ విమానం ఇంజిన్​లో సాంకేతిక సమస్య రావడంతో పైలట్​ పాన్​ కాల్​ ఇచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు. ఇలాంటి ఘటనలతో విమాన ప్రయాణికులు భయపడుతున్నారు. విమానాలను ముందుగానే పూర్తిగా తనిఖీ చేసి ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు.

    More like this

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...

    GST Reforms | జీఎస్టీ ఎఫెక్ట్‌.. రూ. 30.4 లక్షలు తగ్గిన రేంజ్‌ రోవర్‌ ధర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ సంస్కరణల(GST Reforms) ప్రభావం కార్ల ధరలపై కనిపిస్తోంది. కార్ల...