HomeUncategorizedIraq | షాపింగ్​ మాల్​లో అగ్ని ప్రమాదం.. 60 మంది సజీవ దహనం

Iraq | షాపింగ్​ మాల్​లో అగ్ని ప్రమాదం.. 60 మంది సజీవ దహనం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iraq | షాపింగ్​ మాల్​లో ఘోర అగ్ని ప్రమాదం(Serious Fire Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 60 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఇరాక్​(Iraq)లోని అల్-కుత్ నగరంలోని చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఓ షాపింగ్​ మాల్(Shopping Mall)​లో రద్దీ అధికంగా ఉన్న సమయంలో మంటల చెలరేగాయి.

దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు లోనై పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మంటల్లో చిక్కుకొని 60 మంది మృతి చెందారు. మరో 11 మంది ఆచూకీ దొరకడం లేదు. 60 మందిలో 59 మంది మృతులను అధికారులు గుర్తించారు. ఒక మృతదేహం గుర్తు పట్టలేనంతగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే శిథిలాల కింద మృతదేహాలు ఉండి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు.