Fire Accident
Fire Accident | పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fire Accident | ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లా (Tirupati district) రేణిగుంట పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మునోత్​ గ్రూప్​ లిథియం సెల్​ యూనిట్​లో (Munot Group lithium cell unit) గురువారం ఉదయం మంటలు చెలరేగాయి.

బ్యాటరీ తయారీ పరిశ్రమలో (battery manufacturing industry) ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. అనంతరం మంటలు భారీగా చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్​ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బ్యాటరీలు, యంత్రాలు, ముడి సరుకులు కాలి బూడిద అయ్యాయని యాజమాన్యం తెలిపింది. సుమారు రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొంది.

Fire Accident | తప్పిన ప్రాణనష్టం

పరిశ్రమలో గురువారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కార్మికులు ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అదే కార్మికులు పని చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకొని ఉంటే భారీ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. కాగా షార్ట్​ సర్క్యూట్​ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Fire Accident | హైదరాబాద్​లో..

నగరంలోని హైదర్‌గూడ ప్రాంతంలో (Hyderguda area) గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వాగత్ గ్రాండ్ బిల్డింగ్ సెల్లార్‌లో ఫుట్‌వేర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు.