HomeUncategorizedGaribhrath Express | గరీబ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. తప్పిన ప్రమాదం

Garibhrath Express | గరీబ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. తప్పిన ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Garibhrath Express | గరీభ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన రాజస్థాన్‌(Rajasthan)లోని బీవర్ జిల్లా సెంద్ర రైల్వే స్టేషన్‌లో (Sendra Railway Station) శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రైలు ఇంజిన్​లో మంటలు చెలరేగాయి.

లోకో పైలట్ (Loco Pilot) వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్​లో మంటలు అంటుకొని పొగలు బోగీలోకి వచ్చాయి. దీంతో ప్రయాణికులు లోకో పైలెట్​కు సమాచారం అందించారు. దీంతో ఆయన వెంటనే రైలును నిలిపివేశాడు. బోగీలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇంజిన్​ కాలిపోయింది.

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. రైల్వే అధికారులు (Railway Officers) ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సాంకేతిక లోపం లేదంటే ఇంజిన్‌లోని షార్ట్ సర్క్యూట్(Short Circuit)​తో మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.