అక్షరటుడే, వెబ్డెస్క్:Canada | కెనడాలో కార్చిచ్చు వ్యాపించింది. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం (Government) అప్రమత్తమైంది.
ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు, అత్యవసర పరిస్థితిని విధించారు. కెనడా పశ్చిమాన గల సస్కెట్చివాన్ ప్రావిన్స్(Saskatchewan Province)లో కార్చిచ్చు చెలరేగింది. దీంతో మాంటోబా ప్రావిన్స్(Manitoba Province)లో దాదాపు 17,000 మందిని ఇళ్లు ఖాళీ చేయించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కార్చిచ్చు వ్యాపిస్తున్న ప్రాంతాల్లో ప్రజలను తరలించడానికి కెనడా వైమానిక దళం(Canadian Air Force) రంగంలోకి దిగింది. కార్చిచ్చు దాటికి భారీగా పొగ అలుముకుంది. మంటలను అదుపులోకి తీసుకు రావడానికి చేస్తున్న చర్యలు ఫలితాలను ఇవ్వడం లేదు.