HomeతెలంగాణHyderabad | కదులుతున్న బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

Hyderabad | కదులుతున్న బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | కదులుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

ఓ సిటీ బస్ నగరంలోని మాసబ్​ ట్యాంక్​ నుంచి రాజేంద్రనగర్​ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మెహదీపట్నం (Mehdipatnam) వద్దకు చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్​ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ఆ సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వారు వెంటనే కిందకు దిగడంతో ఎవరికీ గాయాలు కాలేదు.

Hyderabad | షార్ట్​ సర్క్యూట్​తో..

షార్ట్​ సర్క్యూట్(Short Circuit)​తో బస్సులో మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మెహదీపట్నం వద్ద పిల్లర్ నం 9 సమీపంలోకి చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం కాలిపోయింది.

Hyderabad | వరుస ఘటనలతో ఆందోళన

ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఇటీవల రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. పలు చోట్ల బస్సులు మొరాయిస్తున్నాయి. నిర్వాహణ సరిగా లేకపోవడంతోనే బస్సులు ప్రమాదాలకు గురి అవుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సులకు మరమ్మతులు చేపట్టాలని, ఫిట్​నెస్​ లేని బస్సులను తొలగించాలని డిమాండ్​ చేస్తున్నారు.