అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Electricity | చెత్తకుప్పకు నిప్పు పెట్టడంతో ట్రాన్స్ఫార్మర్కు మంటలు తాకి విద్యుత్ సరఫరా (power supply) నిలిచిపోయింది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో (Kamareddy town) ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
Kamareddy Electricity | పట్టణంలోని శ్రీరాంనగర్‌లో..
స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలోని రైల్వే ట్రాక్ పక్కన చెత్తకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్కు మంటలు వ్యాపించాయి. దాంతో కాలనీలో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన విద్యుత్ అధికారులు (Electricity officials) ఆఘమేఘాల మీద పునరుద్ధరణ పనులు చేపట్టారు.
Kamareddy Electricity | స్పందించిన విద్యుత్‌శాఖ అధికారులు..
పట్టణంలోని శ్రీరాంనగర్‌లో చెత్తకు నిప్పు పెట్టడం కారణంగా ట్రాన్స్ఫార్మర్కు అంటుకుని విద్యుత్ సరఫరా నిలిచిపోగా అధికారులు వెంటనే స్పందించారు. ముందుగా మంటలు ఆర్పివేశారు. అనంతరం సిబ్బంది ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.