163
అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad City | నగరంలోని పులాంగ్ వద్ద బైక్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. పులాంగ్ ప్రాంతంలోని వంశీ ఇంటర్నేషనల్ (Vamsi International) ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్‌లో నుంచి ఓ వ్యక్తి బైక్‌పై బయటకు వస్తూ రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్‌పైన ఉన్న వ్యక్తి పక్కకు దూకేశాడు. అనంతరం అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది అగ్నిమాపక యంత్రం ద్వారా మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది.