Homeజిల్లాలునిజామాబాద్​Fire Department | సినిమా థియేటర్లలో అగ్నిమాపక శాఖ తనిఖీలు

Fire Department | సినిమా థియేటర్లలో అగ్నిమాపక శాఖ తనిఖీలు

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Fire Department | నగరంలోని సినిమా థియేటర్లలో అగ్నిమాపకశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం శివాజీనగర్​లోని ఉషామయూరి మల్టీప్లెక్స్ (Ushamayuri Multiplex)​, హైదరాబాద్​ రోడ్​లోని పీవీఆర్​ సినిమా వేణుమాల్​లో (PVR Cinema Venumal) అధికారులు తనిఖీ జరిపారు. థియేటర్లలో ఫైర్​సేఫ్టీ కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. తనిఖీల్లో డిస్ట్రిక్ట్​ ఫైర్​ ఆఫీసర్​ (District Fire Officer) పరమేశ్వర్​, స్టేషన్​ ఎస్​ఎఫ్​ఓ శంకర్​, రూరల్​ ఎస్​ఎఫ్​వో విక్రమ్​కుమార్​, సిబ్బంది ప్రవీణ్​ తదితరులు పాల్గొన్నారు.