HomeUncategorizedAmaravati | మోదీ స‌భ‌కి కొద్ది దూరంలో భారీ అగ్ని ప్ర‌మాదం.. ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డ ప్ర‌జ‌లు

Amaravati | మోదీ స‌భ‌కి కొద్ది దూరంలో భారీ అగ్ని ప్ర‌మాదం.. ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డ ప్ర‌జ‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: amaravati | అమ‌రావ‌తి పునః ప్రారంభం కార్య‌క్ర‌మం కోసం భార‌త ప్రధాని న‌రేంద్ర మోదీ(Pm Modi) ఈ రోజు ఏపీకి వచ్చారు. ఆయ‌న అమరావతి దశ దిశ తిరిగిపోయే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.49,040 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటితో పాటు మరో రూ.8 వేల కోట్ల విలువైన ఇతర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే అమరావతి పునర్నిర్మాణ వేదికకు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సభకు సరిగ్గా 5కిలో మీటర్ల దూరంలో మంటలు ఎగసిపడ్డాయి. ఎల్ అండ్ టీ కంపెనీ పైపులకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

Amaravati | భారీ అగ్ని ప్ర‌మాదం..

అయితే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. మోడీ సభకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో.. వెంటనే అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. అటు అగ్నిమాపక సిబ్బంది కూడా.. ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మూడు కిలోమీటర్ల దూరంలోనే భారీ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో.. మోడీ సభ దగ్గర భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇక అమ‌రావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

చారిత్రక పరంపర, ప్రగతి రెండు కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తుందని తెలిపారు. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్, బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం ఇది అని ఆయ‌న అన్నారు. అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి అని ప్రధాని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని.. ఏపీలోని Andhra Pradesh ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందని వెల్లడించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. కానిక్‌ భవనాలుగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లను మూడేళ్లలో ఇతర ప్రాజెక్టులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.