అక్షరటుడే, ఇందల్వాయి : NH 44 | జాతీయ రహదారి(National Highway)పై ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఇందల్వాయి టోల్ ప్లాజా(Indalwai Toll Plaza) వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ లాజిస్టిక్కు చెందిన ట్రక్కు హరియాణా నుంచి సరుకుతో నాగ్పూర్ వైపు వెళ్తోంది.
సోమవారం ఉదయం ఇందల్వాయి టోల్ ప్లాజా వద్దకు చేరుకోగా.. డీజిల్ ట్యాంకు(Diesel Tank) నుంచి మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసి పడడంతో స్థానికులు పక్కనే ఉన్న బోరు ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.