అక్షరటుడే, ఇందూరు: Grameen Bank fire accident | తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ పరిధిలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు కార్యాలయంలో బుధవారం (నవంబరు 26) అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాంకు నుంచి మంటలు, పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
Grameen Bank fire accident | భారీగా నష్టం..
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగసి పడుతున్న మంటలను అదుపు చేశారు. బ్యాంకు కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, లాప్టాప్లు అన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు.