అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad city | నగరంలోని ఓ ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ షాప్‌లో (Interior Architect Shop) అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన సుభాష్‌నగర్‌లోని (Subhash nagar) అయ్యప్ప మందిరం సమీపంలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యప్ప మందిరం (Ayyappa mandir) సమీపంలోని బీవీఎం ఆర్కిటెక్చర్, ఇంటీరియల్ డిజైనింగ్ షాప్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా షార్ట్‌సర్క్యూట్‌తో (Short circuit) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
దుకాణంలో పొగలు, మంటలు వెలువడడంతో గమనించిన స్థానికులు వెంటనే ఫైర్‌స్టేషన్‌కు (Fire station) సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
