Homeఆంధప్రదేశ్Gannavaram Airport | గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో అగ్నిప్ర‌మాదం.. క‌స్ట‌మ్స్ గ‌దిలో చెల‌రేగిన మంట‌లు

Gannavaram Airport | గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో అగ్నిప్ర‌మాదం.. క‌స్ట‌మ్స్ గ‌దిలో చెల‌రేగిన మంట‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఇక్క‌డి క‌స్ట‌మ్స్ అధికారుల గ‌దిలో మంట‌లు చెల‌రేగాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gannavaram Airport | ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో (Gannavaram International Airport)  మంగ‌ళ‌వారం అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. కస్టమ్స్ అధికారుల గదిలో భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) సంభవించింది.

ఈ మంటల్లో సాఫ్ట్‌వేర్ పరికరాలు, ఇమ్మిగ్రేషన్ గదిలో స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ (Split Air Conditioner) కస్టమ్స్ అధికారులకు చెందిన లగేజ్ బ్యాగులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియ‌రాలేదు.

Gannavaram Airport | పవర్ బ్యాంక్ మంటలకు కారణమైంది

అక్టోబర్ 19న ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ట్యాక్సీలో ప్రయాణిస్తుండగా దిమాపూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. క్యాబిన్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పగలిగారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు.. ప్ర‌మాదంపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. “ఎలక్ట్రానిక్ వస్తువులను, ముఖ్యంగా లిథియం బ్యాటరీలతో కూడిన వాటిని విమానంలోకి తీసుకెళ్లడానికి కఠినమైన నిబంధనలు ఉన్నాయి” అని ఆయ‌న తెలిపారు.