అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని ఓ కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. మైత్రీవనంలోని శివమ్ టెక్నాలజీస్ (Shivam Technologies)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
నగరంలోని అమీర్పేట (Ameerpet), మైత్రివనం ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఇక్కడ చాలా ఇనిస్టిట్యూట్లలో కనీస నిబంధనలు పాటించారు. ఇరుకు భవనాల్లో శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తారు. రోడ్లు సైతం ఇరుకుగా ఉంటాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదంలో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు.
Hyderabad | విద్యార్థుల తరలింపు
మైత్రీవనంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. పక్కన ఉన్న కోచింగ్ సెంటర్ల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. బ్యాటరీలు పేలడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Hyderabad | విశాఖలో..
ఏపీలోని విశాఖపట్నం (Visakhapatnam)లో గల ఆర్కే బీచ్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. రాధ బీచ్ రెసిడెన్సీలోని 6వ అంతస్తులోని ఓ ఫ్లాట్లో మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.