HomeజాతీయంGarib Rath Express | రైలులో అగ్ని ప్రమాదం.. మూడు బోగీలు దగ్ధం

Garib Rath Express | రైలులో అగ్ని ప్రమాదం.. మూడు బోగీలు దగ్ధం

Garib Rath Express | రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్​లో జరిగిన ఈ ఘటనలో మూడు బోగీలు కాలిపోయాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Garib Rath Express | రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని మూడు బోగీలు కాలిపోయాయి. ఈ ఘటన పంజాబ్​ (Punjab)లోని సిర్హింద్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర చోటు చేసుకుంది.

అమృత్‌సర్ (Amritsar) నుంచి సహర్సాకు వెళ్తున్న గరీబ్​రథ్ ఎక్స్‌ప్రెస్​లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. మూడు జనరల్ కోచ్‌లు దెబ్బతిన్నాయి. గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ సిర్హింద్ రైల్వే స్టేషన్ నుండి అంబాలా వైపు అర కిలోమీటరు దూరంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా ఒక కోచ్ నుంచి పొగలు వచ్చాయి. అనంతరం మరో రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి.

Garib Rath Express | తప్పిన ముప్పు

మంటలు రావడాన్ని గమనించి అప్రమత్తమైన లోకోపైలెట్​ వెంటనే రైలును ఆపేశారు. ప్రయాణికులు (Passengers) సురక్షితంగా రైలులో నుంచి దిగిపోయారు. అనంతరం మంటలు వ్యాపించి బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. పొగలు రావడాన్ని గమనించి రైలును ఆపేయడంతో ప్రాణనష్టం తప్పిందని సిర్హింద్ GRP SHO రతన్ లాల్ తెలిపారు. రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Garib Rath Express | ప్రయాణికుల ఆందోళన

రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్ అధికారులు, GRP, RPF, పోలీసులు సంఘటనా స్థలానికి చేరి, ప్రయాణికులను ఇతర కోచ్‌లకు సురక్షితంగా తరలించారు. ఆపై ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని తేలింది. రైల్వే ఇంజనీర్ల బృందం ఇంకా పూర్తి పరిశీలన చేస్తుంది. రైలు దిగుతున్న సమయంలో కొంద‌రు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.