అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad city | నిజామాబాద్ నగరంలో ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బైపాస్‌లోని రాయల్ ఓక్ ఫర్నీచర్ షోరూం(royaloak)లో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్(Short circuit) వల్ల అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫైర్ యాక్సిడెంట్(Fire accident)లో సుమారు రూ. 10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. డిస్ట్రిక్ట్ ఫైర్ పరమేశ్వర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.