అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో (Kachiguda) విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగ్గా చిన్నారి మృతి చెందింది.
కాచిగూడ పోలీస్ స్టేషన్ (Kachiguda Police Station) పరిధిలో ఉన్న సుందర్ నగర్లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. ఒ ఇంట్లో ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి. అనంతరం ఇంట్లో వ్యాపించాయి. ఈ ఘటనలో చిన్నారి సజీవ దహనం అవ్వగా.. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి (Osmania Hospital) తరలించారు. పరిస్థితి విషమయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్తో (short circuit) ఏసీ పేలిపోయినట్లు సమాచారం. ఏసీ నుంచి విషపూరిత వాయువులు గదిలో నిండిపోయాయి. ఆ సమయంలో గదిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంటలు వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయారు. స్థానికులు గమనించి బాలుడిని బయటకు తీసుకు వచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను ఆర్పి వేశారు. కాగా ఇటీవల నగరంలో అగ్ని ప్రమాదాలు తరచూగా చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్ కారణం అవుతోంది. దీంతో ఇంట్లో విద్యుత్ వైర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.