4
అక్షరటుడే, ఇందూరు: Fire accident | నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కోటగల్లిలోని షేక్ జావిద్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. నష్టాన్ని అంచనా వేశారు.
Fire accident | షార్ట్ సర్క్యూట్ వల్లే..
షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. బీరువా, టీవీ, బంగారం, నగదు, ఫర్నిచర్, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు బాధిత యజమాని వాపోయారు.