ePaper
More
    HomeFeaturesEPFO | మీ పీఎఫ్​ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో.. జస్ట్​ మిస్డ్​ కాల్​తో తెలుసుకోండి

    EPFO | మీ పీఎఫ్​ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో.. జస్ట్​ మిస్డ్​ కాల్​తో తెలుసుకోండి

    Published on

    • అక్షరటుడే, వెబ్​డెస్క్ : EPFO | ప్రతి ప్రైవేట్​ ఉద్యోగికి ఆయా సంస్థలు పీఎఫ్ PF​ సౌకర్యం కల్పిస్తాయి. ఎంప్లాయి ప్రావిడెంట్​ ఫండ్​(EPF)లో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత కట్​ అయి యాడ్​ అవుతోంది. ఉద్యోగి బేసిక్​ శాలరీ basic+డీఏలో నుంచి పీఎఫ్​ అకౌంట్​లో 12 శాతం యాడ్​ అవుతోంది. సదరు ఉద్యోగి పనిచేసే కంపెనీ కూడా అంతే మొత్తం ఉద్యోగి పీఎఫ్​ అకౌంట్లో జమ చేస్తుంది. ఇందులో నుంచి 3.67 పీఎఫ్​ ఖాతాలో జమ అయితే 8.33శాతం పెన్షన్​ pension అకౌంట్​లోకి వెళ్తుంది.

    EPFO | సేవలు సులభతరం

    ఈపీఎఫ్​వో EPFO ఉద్యోగుల కోసం సేవలను సులభతరం చేస్తోంది. గతంలో ఆఫీస్​ల చుట్టూ తిరిగితే కాని పనులు అయ్యేవి కావు. ప్రస్తుతం అంతా ఆన్​లైన్​లో నుంచి చేసుకోవచ్చు. దీనికి ఉద్యోగి పీఎఫ్​ యూఏఎన్ UAN​ నంబర్​, ఆధార్ aadhrar​, మొబైల్ నంబర్ mobile number ​ లింక్​ అయి ఉంటే చాలు. ఎక్కడి నుంచైనా పీఎఫ్​ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. అంతేగాకుండా డబ్బులు కూడా విత్​డ్రా చేసుకోవచ్చు.

    EPFO | వడ్డీ ఎంతంటో..

    ఈపీఎఫ్​వో epfo భవిష్యనిధిలో జమైన డబ్బులకు గత ఆర్థిక సంవత్సరంలో 8.25శాతం వడ్డీ చెల్లించింది. అయితే ఇందులో పీఎఫ్​ అకౌంట్​లో ఉన్న నగదుకు మాత్రమే వడ్డీ ineterest వస్తుంది. పెన్షన్​ అకౌంట్​లో ఉన్న డబ్బుకు వడ్డీ రాదు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్​వో సమావేశం నిర్వహించి వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.

    EPFO | బ్యాలెన్స్​ ఇలా తెలుసుకోవచ్చు..

    పీఎఫ్​ అకౌంట్​లో ఎంత డబ్బులు జమయ్యాయో తెలుసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అయితే బ్యాలెన్స్​ ఎంక్వైరీ balance enquiry, ఇతర లావాదేవీల కోసం యూఏఎన్ యాక్టివేషన్​ తప్పనిసరి. ఈపీఎఫ్​వో పోర్టల్​లో లాగిన్​ అయి వివరాలు బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవచ్చు.

    రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు ఒక మిస్డ్ కాల్ missed call ఇస్తే పీఎఫ్​ బ్యాలెన్స్​ వివరాల మెసేజ్​ వస్తుంది. ఇది సులభంగా తెలుసుకునే మార్గం. వెబ్​సైట్​లో లాగిన్​ గురించి అంతగా తెలియని వారు కూడా మిస్​కాల్​ ఇచ్చి పీఎఫ్​ ఖాతాలో ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

    రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 నంబర్‌కు EPFOHO UAN అని టైప్ చేసి మెసేజ్ పంపితే కూడా బ్యాలెన్స్​ వివరాలు balance వస్తాయి. అంతేగాకుండా ఉమంగ్​ umang యాప్​లో కూడా ఈపీఎఫ్​వో సర్వీస్​లోకి వెళ్లి బ్యాలెన్స్​ ఎంక్వైరీ, డబ్బులు పాక్షికంగా విత్​డ్రా, పూర్తిగా విత్​డ్రా కూడా చేసుకోవచ్చు.

    Latest articles

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    Saina kashyap couple | ఇటీవ‌లే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సైనా నెహ్వాల్.. మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నామంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Saina kashyap couple | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ (Saina Nehwal), పారుపల్లి...

    Ind vs Eng | విజ‌యానికి 8 వికెట్ల దూరంలో భార‌త్.. 123 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తారా..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ind vs Eng | ఇంగ్లండ్‌తో England జ‌రుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఓవ‌ల్ వేదిక‌గా చివ‌రి...

    More like this