అక్షరటుడే, బోధన్: Bodhan | ఎడపల్లి మండలం జానకంపేట్‌కు (janakampet) చెందిన సంజీవ్ ఇటీవల మృతి చెందాడు. దీంతో అతని చిన్ననాటి మిత్రులు అతని కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు. 1998–99 బ్యాచ్ పదో తరగతి మిత్రులు తమవంతుగా రూ.20,500 నగదు, నిత్యావసర సరుకులు శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో అస్లాం ఖాన్, శ్రవణ్ కుమార్, రాజ్ కుమార్, శ్రీనివాస్, మురళి, భాస్కర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
