Homeజిల్లాలునిజామాబాద్​Balkonda | బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Balkonda | బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్ : Balkonda | బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు వడ్ల రాజేశ్వర్ అక్క కల్లెడ రాజమణి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బాల్కొండ బీజేపీ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు.

అంత్యక్రియల నిమిత్తం రూ. పది వేల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సాయం అందజేసిన బీజేపీ నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు అంబటి నవీన్, మాజీ ఎంపీటీసీ లింగాగౌడ్, కిసాన్ మోర్చా మండలాధ్యక్షుడు ఆరెపల్లి నర్సయ్య, మండల నాయకులు కొత్తింటి రాకేష్, సుంకం శ్రీనివాస్, తోపారం అశోక్, ఠాకూర్ రాము, తోట నవీన్, రాంకిషన్, సుబ్బాయి సాయిలు, మద్దుల రమేష్,గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.