అక్షరటుడే, ఇందూరు: Vasavi Seva Samiti Trust | నగరంలో ప్రతిభ కలిగిన పేద ఆర్యవైశ్య విద్యార్థులకు (Arya Vaishya) ఆర్థికసాయం అందజేశారు. స్థానిక అర్వపల్లి పురుషోత్తం కల్యాణ మండపంలో (Arvapalli Purushottam Kalyana Mandapam) శ్రీ వాసవి సేవా సమితి ట్రస్ట్ (Vasavi Seva Samiti Trust) నిజామాబాద్ ఆధ్వర్యంలో ‘విద్యానిధి’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు అర్వపల్లి పురుషోత్తం మాట్లాడుతూ.. నిరుపేద, ప్రతిభ కలిగిన ఆర్యవైశ్య విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఆర్థికసాయం చేస్తున్నామన్నారు.
Vasavi Seva Samiti Trust | 20 మంది విద్యార్థులకు..
ఇరవై మంది ఆర్య వైశ్య విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.21వేల చొప్పున చెక్కులు అందజేసినట్లు పురుషోత్తం వివరించారు. శ్రీ వాసవీ సేవా సమితి ట్రస్ట్ ద్వారా రెండేళ్లలో 100 మంది విద్యార్థులకు ఆర్థికసాయం అందజేసినట్లు ఆయన స్పష్టం చేశారు. విద్య ద్వారానే సమాజంలో చైతన్యం వస్తుందనే ఆలోచనతో ఆర్యవైశ్య ప్రముఖులంతా ట్రస్ట్‌గా ఏర్పడి సేవాకార్యక్రమాలు చేస్తున్నామని ఆయన వివరించారు.
Vasavi Seva Samiti Trust | ఎల్లవేళలా సహకారం..
పేద, తల్లి దండ్రులు లేని, ప్రతిభ కలిగిన విద్యార్థులకు తమ ట్రస్ట్ ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తమ ట్రస్ట్ ద్వారా భవిషత్తులో పేద, ప్రతిభ కలిగిన విద్యార్థులకు విద్య, వైద్య, క్రీడారంగాల్లో నైపుణ్యం కల్గిన విద్యార్థులకు చేయూతనిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైద్యులు వెంకట రమణ, ముక్కా వినోద్, వెండి, బంగారు వర్తకుల సంఘం (Silver Gold Merchants Association) అధ్యక్షుడు పాల్దె లక్ష్మీకాంతం, ట్రస్ట్ అధ్యక్షుడు పాల్దె రాజేశ్వర్, జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు మోటూరి మురళి, పట్టణ సంఘం మాజీ అధ్యక్షుడు విశ్వనాథం శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, తలిదండ్రులు పాల్గొన్నారు.