Homeజిల్లాలుకామారెడ్డిKotagiri | పోతంగల్​లో పలువురికి ఆర్థికసాయం

Kotagiri | పోతంగల్​లో పలువురికి ఆర్థికసాయం

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి : Kotagiri | పోతంగల్ (Pothangal) మండలంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్​ పలువురికి ఆర్థికసాయం అందజేశారు. మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ కొడిచెర్ల సాయమ్మకు చెందిన రేకుల షెడ్డు ఇటీవల వర్షాలకు కూలిపోయింది.

దీంతో కోనేరు శశాంక్ (Koneru Shashank)​ స్పందించి ఆమె ఇంటికి వెళ్లి తన కోనేరు చారిటబుల్​ ట్రస్ట్​ ద్వారా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే జల్లపల్లి గ్రామానికి చెందిన అజ్మీర్​ లక్ష్మి రాష్ట్రస్థాయి రైఫిల్​ కాంపీటిషన్​లో ప్రథమ బహుమతి గెల్చుకున్నారు. కానీ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పలువురు ఎన్​ఆర్​ఐ శంశాంక్​కు సమాచారం అందించారు. స్పందించిన ఆయన కోనేరు చారిటబుల్​ ట్రస్ట్ (Koneru Charitable Trust)​ ద్వారా రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు.

రాబోయే రోజుల్లోనూ బడుగు బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందజేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు ప్రకాష్ పటేల్, ముక్కయ్య, మేత్రి కిరణ్, ఓమన్న పటేల్, సంతోష్ పటేల్, గంగాధర్ పటేల్, బూత్ అధ్యక్షుడు వినోద్, రమేష్, విజయ్, రాజు, గ్రామస్థులు యువకులు తదితరులున్నారు.

Must Read
Related News