అక్షరటుడే, ఇందల్వాయి: Indiramma Housing Scheme | మండలంలోని గౌరారం గ్రామంలో 32 మందికి ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి(Former MPP Immadi Gopi) ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు సాయం చేస్తే ఆత్మసంతృప్తి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈ అనూష, కార్యదర్శి సుశీల, బ్యాంక్ మేనేజర్ ప్రశాంత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
