అక్షరటుడే, ఇందూరు: Constable family | రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ శ్రీను నాయక్ (constable srinu nayak) కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. 2013 బ్యాచ్ ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల మిత్రులు ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు బుధవారం కానిస్టేబుల్ కూతురు కృతిక పేరుపై భార్య చంద్రకళ సమక్షంలో రూ.5లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అలాగే శీను నాయక్ తల్లి లక్ష్మికి రూ.1.12 లక్షలు అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన కానిస్టేబుళ్లు అలీం, అశోక్, మహేష్, మహబూబ్‌నగర్‌కు చెందిన మహేష్, వెంకటేష్, మల్లేష్, కృష్ణ, దేవుల నాయక్, మాతృనాయక్ పాల్గొన్నారు.
