అక్షరటుడే, ఇందూరు: Nizamabad | కామారెడ్డి జిల్లా జుక్కల్ వసతి గృహ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కాగా నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి జిల్లా వసతి గృహ అధికారులు రాజేందర్ చికిత్సకు ఆర్థికసాయం అందజేశారు. శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుమన్‌తో కలిసి నగదును అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చేందర్, టీఎన్జీవో జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, సిటీ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, నాయకులూ స్వామి, సుధాకర్, సురేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
